పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతి వ్యక్తి బాధ్యత

154பார்த்தது
పర్యావరణాన్ని  రక్షించుకోవడం ప్రతి వ్యక్తి బాధ్యత
మానవాళితోపాటు జీవకోటి మను గడకు మూలాధారమైన పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతి వ్యక్తి బాధ్యత అని జడ్పీ ఫ్లోర్ లీడర్ గుంటూరి పెద్దిరాజు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం అప్పన్న చెరువు గ్రామం శివారు సబ్బేవారి పేటలో ఏర్పాటు చేసిన ' గోదావరి పర్యావరణ పరిరక్షణ సమితి' సేవా సంస్థను శనివారం ఆయన మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ధిరాజు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, పర్యావరణ పరిరక్షణ పై ప్రజలను చైతన్యం చేయడం కోసం 'గోదావరి పర్యావరణ పరిరక్షణ సమితి' పేరుతో సేవా సంస్థను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు.

ఈ సేవా సంస్థ ద్వారా పర్యావరణ పరిరక్షణ సేవా కార్యక్రమాలతో పాటు సమాజానికి ఉపయోగపడే మరిన్ని సేవ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పెదపాటి పెద్దిరాజు, పాలకొల్లు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ మెంబర్ చినిమిల్లి గణపతి రావు, సేవా సంస్థ అడ్వైజర్ కొల్లా బత్తుల సూర్య కుమార్ లు మాట్లాడుతూ ఆధునిక కాలంలో కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్న పర్యావరణాన్ని రక్షించుకోవలసిన ఆవశ్యకతపై గోదావరి పర్యావరణ పరిరక్షణ సమితి సేవా సంస్థ ద్వారా భావితరాలను చైతన్యం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

సేవా సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వారణాసి శ్రీనివాసరావు, బి. చిట్టిబాబు లు మాట్లాడుతూపర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం, ప్రజలను, విద్యార్థులను చైతన్యం చేయడం లక్ష్యంగా గోదావరి పర్యావరణ పరిరక్షణ సమితి సేవా సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు, ప్రజల సహకారంతో అంకితభావంతో, చిత్తశుద్ధితో సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ చల్లారావు, సేవ సంస్థ సహాయ కార్యదర్శిలు తానేటి శేఖర్, వి. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி