నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో డ్రగ్ అవేరెన్స్ కార్యక్రమం శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలలో గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ విజయసారథి, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్ హాజరయ్యారు. సి.ఐ. విద్యార్థులను ఉద్దేశించి యువత డ్రగ్స్ బాగా అడిక్ట్ అవుతున్నారు, కళాశాల విద్య వయసు అనేది టీనేజ్, ఆకర్షణలు ఉండే వయసు దానిని మీరు అదుపుచేయాలి అన్నారు.