తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. సోమవారం పెనుమంట్ర మండలం మార్టేరులో శ్రీ వేణుగోపాల స్వామి ఆడిటోరియంలో బూత్ క్లస్టర్ ఇన్ ఛార్జ్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి సభ్యత్వ నమోదులో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో 2వ స్థానం, రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచేలా సభ్యత్వ నమోదు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.