వీఆర్వో ఇంట్లో చోరీ
తాళం వేసిన ఇంట్లో చోరీ ఘటనపై గురువారం కేసు నమోదు చేసినట్లు నరసాపురం టౌన్ ఎస్సై ముత్యాలరావు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం. రుస్తుంబాదలోని ఏరియా ఆసుపత్రి సమీపంలో నివసిస్తున్న వీఆర్వో వేణుగోపాల్ ఈ నెల 11 ఇంటికి తాళం వేసి తన తల్లిని వైద్యం నిమిత్తం భీమవరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. తిరిగి వచ్చే సరికి ఇంట్లో ఉన్న ల్యాప్టాప్, 20 తులాల వెండి సామగ్రి అపహరించుకు పోయినట్లు బాధితుడు తెలిపారు.