ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు ఎంపిక చేసిన మిల్లుకు ధాన్యాన్ని అమ్మడానికి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ జెసి ఛాంబర్‌లో జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సభ్యులతో ధాన్యం కొనుగోలు పై సమీక్షించారు.