స్ధానిక శ్రీ వై ఎన్ కళాశాల గ్రంథాలయ విభాగ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరిగిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను బుధవారంతో ఘనంగా ముగిసాయి. ప్రిన్సిపాల్ డాక్టర్ చింతపల్లి కనకారావు మాట్లాడుతూ "సాధారణ జ్ఞానం" అనే అంశంపై వివరించి విద్యార్దుల్లో పోటితత్వం వెలికితీయడంతో పాటు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యం, సృజనాత్మకత పెంపొందించుకోవచ్చని తెలియజేసారు.