దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని మండలాల నందు తాత్కాలికంగా దీపావళి బాణాసంచా సామాగ్రిని అమ్ముకొనుటకు తాత్కాలిక లైసెన్స్ కొరకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఏలూరు రెవిన్యూ డివిజనల్ అధికారి ఎన్. ఎస్. కె. ఖాజావలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ధరఖాస్తు చేసుకొనే వారు అక్టోబరు 13 నుండి అక్టోబరు 31వ తేదీ లోపు ఏలూరులోని రెవిన్యూ డివిజనల్ అధికారివారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.