ద్వారకా తిరుమల మండలంలోని జి.కొత్తపల్లి గ్రామంలో ఉమరామాలిగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకపౌర్ణమి సందర్బంగా శుక్రవారం మహిళలు దీపాలు వెలిగించి పూజలు చేశారు. అనంతరం మహిళలు స్వామిని దర్శించేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారికి పాలు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.