ఏలూరు: పదో తరగతి విద్యార్థులు అలర్ట్
ఏలూరు జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబరు 11లోపు ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. అబ్రహం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 18 వరకు రూ. 50, 25 వరకు రూ. 200, 30వ తేదీలోపు రూ. 500 అపరాధ రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. కావున విద్యార్థులు ముందస్తుగా ఫీజు చెల్లించాలని సూచించారు.