గ్రామాలను స్వచ్ఛత గా ఉంచడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని గ్రామ స్వచ్ఛత మన అందరి బాధ్యత అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంగళవారం దెందులూరులో స్వచ్ఛతహీ సేవా కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలకు స్వచ్ఛత యొక్క ఆవశ్యకతను స్వయంగా వివరించారు. తడి చెత్త పొడి చెత్త వేరుగా వేయాలన్నారు.