పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వద్ద నుండి వారి సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.