ఏలూరులో వైద్యుని నిర్లక్ష్యంతో ఇద్దరు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పందించారు. దీంతో ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లడం జరిగింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యం ముందుకు వచ్చి ఇద్దరు చిన్నారులకు చెరో 5 లక్షల చొప్పున 10 లక్షలు నష్టపరిహారం కింద బాధితుల తల్లిదండ్రులకు మంగళవారం అందజేశారు.