వైసీపీ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించిన అధికారులంతా ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో మాట్లాడారు. వైసీపీ పెట్టిన కేసుల్లో రెండింటిని న్యాయస్థానం కొట్టేసిన విషయం ప్రస్తావనకు వచ్చింది. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం 27 అక్రమ కేసులు పెట్టి వాటిలో రెండింటిని కోర్టు కొట్టేసిందన్నారు.