ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కళాశాల విద్యార్థులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. తమ కళాశాల సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే కాలేజీ, వసతిగృహం, గుడి పరిసరాలలో మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకించారు. అధికారులు దీనిపై స్పందించి తక్షణమే మద్యం దుకాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.