పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న ఎంపీపీ పాఠశాలను బుధవారం ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు.తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ,సర్పంచ్,ఎంపీటీసీ లు,రెవెన్యూ,సచివాలయ సిబ్బంది,ఉపాధ్యాయ, పాఠశాల చైర్మన్,అంగన్వాడీ సిబ్బంది విద్యుత్, ఆరోగ్య సిబ్బంది,కూటమి నాయకులు పాల్గొన్నారు.