మార్టేరులో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం

78பார்த்தது
మార్టేరులో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం
పెనుమంట్ర మండలం మార్టేరు-2 గ్రామంలోని తోకపేట ప్రాంతంలో శుక్రవారం ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ మల్లిక ఆధ్వర్యంలో గ్రామంలోని పలువురు గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, అంగన్వాడీ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఏ రామకృష్ణ, ఎమ్ఎల్ హెచ్ పీ అలేఖ్య, ఏఎన్ ఎం సుజాత, అంగన్వాడీలు, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி