పశ్చిమగోదావరి జిల్లా ఏలేటిపాడు ప్రధాన రహదారి గుండా తణుకు - నిడదవోలు వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారడంతో అటుగా వెళ్లే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అనేకమార్లు ఈ రహదారిని బాగు చేయాలని వాహన దారులు కోరుతున్నా పాలక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అదికారులు స్పందించి వాహన చోదకులకు, ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన రహదారిని బాగు చేయాలని పలువురు కోరుతున్నారు.