అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోట సత్తమ్మ అమ్మవారిని ప్రార్థించానని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి పేర్కొన్నారు. మంగళవారం కోట సత్తెమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించిన ఆయనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో పాటు పురహితులు ఆయనకి సాధన స్వాగతం పలికారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించి సత్కారం చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.