విజయవాడ వరద బాధితుల సహాయార్థం పశ్చిమ గోదావరి జిల్లా రెవిన్యూ అసోసియేషన్ ఉద్యోగులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గురువారం వీఆర్ఏ స్థాయి ఉద్యోగి నుండి తహశీల్దార్ స్థాయి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 7,54,030 రూపాయలు విరాళాలు సేకరించారు. అనంతరం వాటి చెక్కును కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి అందజేశారు.