భీమవరం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం భీమవరం పట్టణంలోని వార్డులలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. భీమవరం జిల్లా కేంద్రంగా చేయడం కోసం మంత్రి పదవిని సైతం వదులుకొని నా స్వలాభం కంటే భీమవరం అభివృద్ధి ముఖ్యమని భావించానని ప్రజల ఆశీస్సులు ఉంటే మంత్రి పదవి ఎప్పుడైనా వస్తుందని, కానీ జిల్లా కేంద్రం ఒక్కసారే వస్తుందని, ప్రజలకు వరంగా అందించాలని పని చేశానని అన్నారు.