మేం సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడిని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఖండించారు. అంబేద్కర్ ఆశయ సాధనలో సిఎం జగన్ పయనిస్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అలాంటి జగన్ పై అంబేద్కర్ జయంతి కంటే ఒకరోజు ముందు దాడి జరగటం బాధాకరమని దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.