జగనన్న కాలనీ లబ్ధిదారులకు నకిలీ పట్టాలు
ఆచంట మండలం కొడమంచిలి పరిధిలోని టి. మెరకలో జగనన్న కాలనీ లబ్దిదారులు ఆదివారం ఆందోళన చేపట్టారు. లబ్ధిదారుల్లో 43 మందికి నకిలీ పట్టాలు వచ్చాయని అధికారులు నిర్ధారణకు రావడంతో వారంతా కాలనీ వద్ద చేరుకున్నారు. పట్టాల కోసం గత ప్రభుత్వంలో కొంతమంది వైసీపీ నాయకులకు రూ. 30 నుంచి రూ. 50 వేలు చెల్లించామని ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే న్యాయం చేయాలని వారు కోరుకున్నారు.