జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సూచించారు. సోమవారం మునగపాక మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధి, డ్రైనేజ్ సౌకర్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలన్నారు. తాను సిన్సియర్ గా పనిచేస్తానని ప్రజా ప్రతినిధులు, అధికారులు అలాగే పని చేయాలన్నారు.