విశాఖ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా కేవీ సూర్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల నుంచి నియామక పత్రం తనకు అందినట్లు ఆయన శనివారం గోపాలపట్నంలో తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.