విశాఖ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి వద్ద ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు ఎస్ఐ విశ్వనాథం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 20 మంది స్కూల్ పిల్లలతో వస్తున్న ఆటో డ్రైవర్‌కు రూ. 10వేల జరిమానా విధించారు. సీఐ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ఆటో వాళ్లు స్కూల్ పిల్లలను తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.