విశాఖలో యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన గంటలోనే నిందితులను అరెస్టు చేసామని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విజయవాడలో తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశించామన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరాలకు పాల్పడే వారిపై కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందన్నారు.