టిడ్కో గృహాలను లబ్ధిదారులకు కేటాయించాలని సీపీఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అలాగే గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. ఈ మేరకు వేపగుంట సచివాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సీపీఐ ఇళ్ల స్థలాలను వేలాది మందికి పంపిణీ చేసిందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు.