రహదారి నిబంధనలు అతిక్రమించి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లుతో పాటు ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్న వారిని కోటవురట్ల పోలీసులు బుధవారం సాయంత్రం స్పెషల్ డ్రైవ్ లో పట్టుకున్నారు. వారితోపాటు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి ఎస్సై రమేష్ కౌన్సిలింగ్ ఇచ్చారు. రహదారి నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు.