కోటవురట్లలో బాల కార్మికుల గుర్తింపునకు కార్మిక శాఖ, ఐసీడీఎస్ అధికారులు, మహిళా పోలీసులు సోమవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పలు షాపులను తనిఖీ చేశారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రామచంద్ర రావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ కనకదుర్గ మాట్లాడుతూ పిల్లలతో పనులు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళా పోలీసులు నాగజ్యోతి, భారతి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.