కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ను శుక్రవారం అమరావతి పార్టీ కార్యాలయంలో పాడేరు నియోజకవర్గం టిడిపి ఇన్-ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె, ఇన్-ఛార్జ్ సీతారామరాజు జిల్లా పాడేరులో పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా.. మంత్రి సానుకూలంగా స్పందించి, త్వరలోనే దీనిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.