హిమాచల్ నగర్ గ్రామదేవత శ్రీశ్రీశ్రీ పెంటమాంబ అమ్మవారి 41వ వార్షికోత్సవ పండగ 11-05-23 నుండి 15-05-23 వరకు జరుగుతుంది. ఈ సందర్భంగా పండగ కరపత్రం విడుదల చేశారు. ముందుగా అమ్మవారి సన్నిధిలో కరపత్రం ఉంచి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, భక్తులు, కమిటీ సభ్యులు హాజరైనారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ ఆర్టిస్ట్ పొట్టి మూర్తి, గ్రామ గౌరవ అధ్యక్షులు గాలి సన్యాసిరావు, గ్రామ అడ్వకేట్ కోలా వెంకటరమణ కమిటీ వారు చేస్తున్న కార్యక్రమాలను మరియు కరపత్రంలో ఆర్థిక సహాయం చేసిన దాతలు పేర్లు పొందుపరిచి పరోక్షంగా ఉత్సవ కమిటీ ఆదాయంను పబ్లిక్కు తెలియజేయడంను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నమ్మి అచ్చియమ్మ ఆలయ చైర్మన్ గౌరీశ్వరరావు, గౌరవ అధ్యక్షులు రంగుభుక్త అప్పలరాజు, అధ్యక్షులు గండేపల్లి షణ్ముఖ గురునాధరావు, సెక్రటరీ జగ్గయ్యమ్మ శీను, కమిటీ సభ్యులు ఎదురు శ్రీనివాసరావు, ఓయిబోయిన గిరీష్ యాదవ్, సాలాపు రవి, సిహెచ్ ఈశ్వరరావు, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.