నర్సీపట్నం మున్సిపాలిటీ బలిగట్టం ప్రాంతంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు టిప్పర్లను గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఎస్ఐ రమేశ్ తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక సరఫరా చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు టిప్పర్లను పట్టుకున్నమన్నారు. డ్రైవర్ల దగ్గర అనుమతి పత్రాలు లేకపోవడంతో ఒక్కొక్క టిప్పర్‌కు రూ. 10 వేలు జరిమానా విధించామని పేర్కొన్నారు. ఇసుక రవాణా సమయంలో అనుమతి పత్రాలు ఉండాలన్నారు.