వచ్చే నెల 8వ తేదీన విశాఖలో జరిగే ఉత్తరాంధ్ర మాలల గర్జనను విజయవంతం చేయాలని మాలల గర్జన సర్సీపట్నం డివిజన్ ఆర్గనైజర్ చిట్ల చలపతిరావు కోరారు. సోమవారం నాతవరంలో మీడియాతో మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణ వద్దు దళితుల ఐక్యత ముద్దు అని, మాలలు వేరు మాదిగల వేరు కాదన్నారు. దళితులంతా ఒకటేనని రాజకీయ నాయకులతో కలిసి మందకృష్ణ మాదిగ విభజించి పాలించాలని చూస్తున్నారని, అందుకు మాలలంతా ఏకం కావాలని ఆయన కోరారు.