రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని బుధవారం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అమరావతిలో మర్యాదపూర్వకంగా కలుసుకొని మాడుగుల నియోజవర్గ వెనుకబడితనం గురించి వివరించారు. మాడుగుల నియోజకవర్గ అభివృద్ధి కోసం చేయాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనతో చర్చించారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించి అన్ని విధాలుగా మాడుగుల అభివృద్ధికి సహకారం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు