మాడుగుల మండలంలో గల పంచాయతీల్లో 69 మంచినీటి పథకాలకు అనుసంధానం చేస్తూ క్లోరినేషన్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఎండిఓ కే. అప్పారావు గురువారం తెలిపారు. ఈ మేరకు వీరనారాయణంలో మంచినీటి పథకానికి ఏర్పాటు చేసిన యూనిట్ నీ ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయితీల్లో గల వాటర్ టాంక్ లు ఎత్తుగా ఉండడం వలన వివిధ కారణాల మూలంగా బ్లీచింగ్ కలపకపోతే అనారోగ్యాలు రాకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు