డిసెంబర్ 14న జరగనున్న జాతీయ్య లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతం అయ్యేవిధంగా అధికారులు అందరూ కృషి చేయాలని చోడవరం సీనియర్ సివిల్ జడ్జి ఈ రాజేంద్ర బాబు సూచించారు. బుధవారం చోడవరం కోర్టు ఆవరణలో పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి లోక్ అదాలత్ కార్యక్రమం గురించి చర్చించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేస్తూ వారి సమస్యలు పరిష్కారo గురించి చర్చించారు.