కేంద్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గల ఇద్దరు సభ్యులు గల నేషనల్ లెవెల్ మానిటరింగ్ బృందం ఆదివారం మాడుగుల మండలంలో పర్యటించింది. ఈ సందర్భంగా సత్యవరం, ఎం కృష్ణాపురం, కింతలి గ్రామంలో పర్యటించిన ఈ బృందం ఆయా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు తీరి గురించి పరిశీలన జరిపారు. అనిల్ గైక్వాడ్, అనిల్ నింబూర్కర్లు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా మహిళలుతో సమావేశం అయ్యారు.