గాజువాక హిమాచల్ నగర్ గ్రామదేవత శ్రీశ్రీశ్రీ పెంటమాంబ అమ్మవారి మారువారం పండగ సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద సుమారు మూడువేలకు పైగా భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ ఏడాది పండగను ఘనంగా నిర్వహించడమే కాకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన కమిటీ వారిని అభినందించారు.
ఈ కార్యక్రమం లుకేష్ కన్స్ట్రక్షన్స్ అధినేత ముంగర నరేంద్ర నారాయణ రాజు , తిప్పల వంశీ రెడ్డి గారు 74 వార్డ్ కార్పొరేటర్ , జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పల్లా యుగంధర్ , రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు సిహెచ్ రామ్మోహన్ నాయుడు, సచివాలయం కన్వీనర్ గాలి సన్యాసి రావు, బిజెపి నాయకులు కౌలూరి గురుమూర్తి ముఖ్య అతిథులుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్ నమ్మి గౌరీశ్వరరావు సారథ్యంలో కమిటీ అధ్యక్షులు గండేపల్లి షణ్ముఖ గురునాధరావు, సభ్యులు సిగటాపు విశాల్ బాబు, సాలాపు రవి, జి లక్ష్మీనారాయణ, ఓ గిరీష్ యాదవ్, సిహెచ్ ఈశ్వరరావు, సుంకరి చక్రి, యానం రెడ్డి వెంకటరమణ, అవసాపు సాయి, ఎం నూకరత్నం, పల్లా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.