గిరిజన రైతులు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. విశాఖలోని జీసీసీ కార్యాలయంలో సోమవారం ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఈ పదవి ఇచ్చిన సీఎం నారా చంద్రబాబునాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ మన్యం అభివృద్ధికి జీసీసీ తోడ్పాటు అందిస్తుందన్నారు. సిఎం విజన్‌తో అరకు కాఫీ ప్రపంచ దేశాలకు విస్తరిస్తామన్నారు.