లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. విశాఖ బిల్ జంక్షన్ సమావేశ మందిరంలో గురువారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. బాలురు బాలికల నిష్పత్తి సమానంగా ఉండాలన్నారు.