వరల్డ్ స్ట్రోక్ డే ను పురస్కరించుకొని విశాఖ విమ్స్‌లో మంగళవారం న్యూరో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ కె. రాంబాబు సోమవారం తెలిపారు. ఈ శిబిరంలో బ్రెయిన్ స్ట్రోక్, నరాల సమస్యలు, మూర్చ వ్యాధి, తలనొప్పి, పక్షవాతం చిన్నపిల్లలకు మానసిక వైకల్యం మొదలగు రోగాలను నిర్ధారించే వైద్య పరీక్షలను నిర్వహిస్తామన్నారు.