కార్మిక కర్షక ప్రజా సమస్యలపై దేశవ్యాప్తంగా ఈనెల 26న బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ రెహమాన్ తెలిపారు. ఈ మేరకు గురువారం హనుమంత వాక వద్ద గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలన్నారు.