జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, ఫెస్ట్ కంట్రోల్ కార్మికులకు బకాయిపడ్డ వేతనాలు తక్షణమే చెల్లించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం చోడవరం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీతాలు చెల్లించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామన్నారు.