రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మాకంగా చేపట్టిన పేదల గృహల నిర్మాణంలో నాణ్యత లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు అధికారులను ఆదేశించారు. డిసెంబర్ చివరి నాటికల్లా పేదలకు లక్ష గృహలను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. గురువారం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయం ద్వారా గృహ నిర్మాణ శాఖ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.