చోడవరం భవిత కేంద్రాన్ని శనివారం సమగ్ర శిక్ష జిల్లా సహిత విద్య సమన్వయకర్త శకుంతల ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో దివ్యాంగ విద్యార్థులు గుర్తించడానికి ప్రశస్త్ యాప్ ను ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు రిజిస్ట్రేషన్ చేసుకుని యాప్ ద్వారా విద్యార్థుల స్క్రీనింగ్ సర్వేను వేగవంతం చేయాలని అన్నారు. అలాగే భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంఖ్యను పెంచాలని సూచించారు.