అనంతగిరి ఎంపీడీవో కార్యాలయాన్ని శనివారం అరకు ఎమ్మెల్యే రేగం మత్సలింగం సందర్శించారు. అనంతరం ఎంపీడీవో కుమార్ తో చర్చించి మండలంలో అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంపీడీవో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రభుత్వ పథకాలకు అర్హత గల వారిని గుర్తించి వారికి పథకాలు అందేలా కృషి చేయాలన్నారు.