ఏపీ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ నూతన చైర్మన్ గా నియమించబడిన కిడారి శ్రావణ్ కుమార్ సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్బంగా కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నా పై నమ్మకంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అప్పగించిన బాధ్యతకు న్యాయం చేస్తానని అన్నారు.