ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుదారులు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 40 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, చీటింగ్ తదితర ఫిర్యాదులు ఉన్నాయని అన్నారు. ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామన్నారు.