సమస్యలను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 40 ఫిర్యాదులు రాగా వాటిలో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, చీటింగ్ తదితర ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.