అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్ లేబరోటరీ యూనిట్ -3లో విష వాయువు లీకై కార్మికుడి మృతి చెందడం అత్యంత బాధాకరమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకై ఒకరు మరణించడంతో పాటు, మరో 7మంది అస్వస్థతకు గురయ్యారనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.